ఐపీఎల్ (IPL16) వ సీజన్లో భాగంగా చెన్త్నె సూపర్ కింగ్స్(Chentne Super Kings) ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ గెలిచింది. మహేంద్రసింగ్ ధోని(Mahendra Singh Dhoni) చిరస్మరణీయంగా మలుచుకోవాలనుకున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఐపీఎల్ (IPL – 16) వ సీజన్లో భాగంగా చెన్త్నె సూపర్ కింగ్స్(Chentne Super Kings) ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ గెలిచింది. మహేంద్రసింగ్ ధోని(Mahendra Singh Dhoni) చిరస్మరణీయంగా మలుచుకోవాలనుకున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. ఆశల్లేని స్థితిలో ధోనీ (32; 17 బంతుల్లో 1×4, 3×6), జడేజా (25*; 15 బంతుల్లో 1×4, 2×6) అద్భుతంగా పోరాడినా చెన్నైను గెలిపించలేకపోయారు. ఆ జట్టులో కాన్వే (50; 38 బంతుల్లో 6×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లు అశ్విన్ (2/25), చాహల్ (2/27) సీఎస్కేకు కళ్లెం వేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (Jos Buttler) శుభారంభం చేశారు. అయితే ఆదిలోనే రాజస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే (Tusshar Deshpande) వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్ పడిక్కల్(Devadat Padikkal )(38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ నిరాపరిచాడు. జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్(Sanju Samson) (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్ (Akash Singh) వేసిన 15 ఓవర్లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్‌రౌండర్ అశ్విన్ (30) ఇదే ఓవర్లో చివరి బంతికి మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్‌గా వచ్చి దుమ్మురేపిన బట్లర్ ఔటయ్యాడు.
మొయిన్ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్ హోల్డర్(Jason Holder), జంపా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. హెట్ మెయర్(30*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ 175 పరుగులు సాధించింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ… ఈ మ్యాచ్ లో తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా…. ధోనీ రెండు సిక్స్ లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కానీ, చివరి బంతికి 5 పరుగులు చేస్తే చెన్నై గెలుస్తుందనగా, సందీప్ శర్మ యార్కర్ (yorker)వేయడంతో ధోనీ సింగిల్ తో సరిపెట్టుకున్నాడు.