»Ruthuraj Gaikwad Is The New Captain Of Chennai Super Kings
CSKG: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ అతడే
చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించారు. మహేంద్ర సింగ్ ధోనీ తరువాత ఆ స్థానాన్ని తీసుకున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. ఆయన ప్రస్తావన చూద్దాం.
Ruthuraj Gaikwad is the new captain of Chennai Super Kings
CSK: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త కెప్టెన్‌ను నియమించింది. యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad)ను కెప్టెన్‌గా నియమిస్తూ సీఎస్కే బోర్డు కీలక ప్రకటన చేసింది. భారత మాజీ కెప్టెన్, ఐదుసార్లు సీఎస్కేకు ఛాంపియన్షిప్ తెచ్చిపెట్టిన ఎంఎస్ ధోనీ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్నారు. మీస్టర్ కూల్ సారథ్యాన్ని ఇన్నాళ్లు చూశాము ఇప్పుడు అదే స్థానంలో ఈ యంగ్ ప్లేయర్ ఎలా తన బాధ్యతలు నిర్వర్తిస్తాడో చూడాలి. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో ఆయా జట్ల సారథులు పాల్గొన్న ఫొటోషూట్లోనూ రుతురాజ్ కనిపించాడు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న ప్రారంభం అవుతుంది. ఇక మొదటి మ్యాచ్ ఆర్సీబీతో సీఎస్కే పోటీపడనుంది.
రుతురాజ్ గైక్వాడ్ 2019 సీజన్లో సీఎస్కే తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడేలేదు. అయినా సరే జట్టు వీడకుండా ఉన్నాడు. తరువాత 2020లో కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. తరువాత సంవత్సరం 2021 ఎడిషన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 635 పరుగులు చేశాడు. ఇక 2022 సీజన్లోనూ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. 368 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. గతేడాది సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో గైక్వాడ్ కీలక పాత్ర వహించాడు. 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. డేవన్ కాన్వే 672 పరుగులు చేయగా ఆయన తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రుతురాజ్. ఇక ఇప్పుడు జట్టుకుగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రుతురాజ్ మొత్తం 52 మ్యాచ్‌లు ఆడి 1,797 పరుగులు చేశాడు.