»Mahendra Singh Dhoni Starts New Inning As Brand Ambassador Of Reliance Retail Jiomart
MS Dhoni: రిలయన్స్ రిటైల్ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
ధోనీకి ఇప్పటికే చాలా కంపెనీలతో అనుబంధం ఉంది. ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం గురించి రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు కంపెనీ తెలిపింది.
MS Dhoni: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రిలయన్స్ రిటైల్ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని నియమితులయ్యారు. ధోనీకి ఇప్పటికే చాలా కంపెనీలతో అనుబంధం ఉంది. ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం గురించి రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు JioMart పండుగ ప్రచారం పేరును కూడా మార్చడం గురించి కంపెనీ తెలియజేసింది. ఇప్పుడు జియోమార్ట్ పండుగ ప్రచారం పేరును ‘జియో ఉత్సవ్, సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా’గా మార్చినట్లు ఆయన తెలిపారు. ఈ పండుగ ప్రచార విక్రయం అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానుంది.
జియోమార్ట్ సీఈవో వరగంటి బీహార్ ఆర్టిజన్ అంబికా దేవి రూపొందించిన మధుబని పెయింటింగ్‌ను ధోనీకి బహూకరించారు. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా 45 సెకనుల యాడ్ లో కనిపించనున్నాడు. జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు మహేంద్ర సింగ్ ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. భారతదేశం దాని శక్తివంతమైన సంస్కృతి, ప్రజలు, పండుగలకు ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు. JioMartతో అనుబంధం కలిగి ఉన్నందుకు, మిలియన్ల మంది భారతీయుల షాపింగ్ ప్రయాణంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని ధోనీ అన్నారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్‌ను స్వాగతిస్తూ, జియోమార్ట్ సీఈఓ సందీప్ వరగంటి మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని సరైన ఎంపిక. అతని వ్యక్తిత్వం జియోమార్ట్ వలె నమ్మదగినది. రిలయన్స్ రిటైల్ జియోమార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి ఫ్యాషన్, బ్యూటీ, ఇంటి అలంకరణ వరకు మిలియన్ల కొద్దీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. . JioMart ప్లాట్‌ఫారమ్ అర్బన్ లాడర్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ జ్యువెల్స్, హామ్లీస్‌తో సహా వివిధ రిలయన్స్ యాజమాన్యంలోని బ్రాండ్ల నుండి వేలాది ఉత్పత్తులను కలిగి ఉంది. ప్రస్తుతం, జియోమార్ట్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో 1000 కంటే ఎక్కువ మంది కళాకారుల 1.5 లక్షల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.