CSK vs PBKS: పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో నాల్గవ విజయం సొంతం చేసుకుంది. పటిష్టమైన చెన్నై జట్టును మట్టికరిపించింది. 7 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు కేవలం 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు టార్గెట్ రీచ్ అయింది. పంజాబ్ బ్యాటర్ల జానీ బెయిర్ స్టో, రిలీ రోసో, శశాంక్ సింగ్, శామ్ కరన్ అద్భుతంగా రాణించడంతో పంజాబ్ విట్టు విజయతీరాలకు చేరుకుంది. చెన్నై బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. శార్ధుల్ ఠాకుర్, శివం దుబే, రిచర్డ్ గ్లీసన్ ఒక్కక్క వికెట్ తీశారు. తీక్షణ, పతిరణ, ముకేశ్ చౌదరిలు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. చెన్నైను బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. ఓపెనర్లు అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం ఇచ్చారు. 8 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా జాగ్రత్తగా ఆడిన చెన్నై జట్టుకు హర్ ప్రీత్ బ్రార్ షాక్ ఇచ్చాడు. రహానే వికెట్ పడగొట్టాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలయింది. హార్డ్ హిట్టర్ శివందుబే తొలి బంతికే ఔట్ కావడం చెన్నై జట్టుకు కోలుకోలేని దెబ్బ తీసింది. రవీంద్ర జడేజా కూడా చేతులెత్తేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో మిడిల్ ఓవర్లలో చెన్నై స్కోర్ అతి దారుణంగా పడిపోయింది. చివర్లో సమీర్ రిజ్వీ, మొయిన్ ఆలీ ఆచితూచి ఆడారు. చివర్లో వచ్చిన ధోనీ 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 14 పరుగులు చేశాడు. దీంతో చెన్నై స్కోర్ 162కి చేరింది. ఈజీ టార్గెట్ ను పంజాబ్ జట్టు ఆడుతూ పాడుతూ చేరుకుంది. చెన్నై జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడి 5 మ్యాచులు గెలిచింది. మరో 5 మ్యాచులు ఓడింది. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో ఉంది. కోల్ కతా రెండో స్థానంలో ఉండగా, లక్నో జట్టు మూడో స్థానంలో ఉంది.