»Srh Players Nitish Kumar Reddy Heinrich Klassen T Natarajan Noise
SRH Players: గచ్చిబౌలి షాపింగ్ మాల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ సందడి.. వీడియో వైరల్
ఐపీఎల్ ప్రేక్షకుల మనసుదోచుకున్న ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ హైదరాబాద్ షాపింగ్ మాల్లో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
SRH players Nitish Kumar Reddy, Heinrich Klassen, T. Natarajan noise
SRH Players: ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదారబాద్ జట్టు అదరగొడుతున్నారు. వారి అద్భుతమైన ఆటకు ప్రేక్షకులు మంత్రముగ్దులు అవుతున్నా తీరు చూస్తూనే ఉన్నాము. అందరిని ఆకట్టుకుంటున్న ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 విజయాలు కాగా 4 ఓటమిపాలు అయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తరువాతి ఆట గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడనుంది. సొంతమైదానంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ షాపింగ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
రేపు మ్యాచ్ ఉండడంతో హైదరాబాద్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు షాపింగ్ మాల్స్‌లలో సందడి చేశారు. గచ్చిబౌలిలోని గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఈ ఆటగాళ్లు అభిమానులతో సందడి చేశారు. ఇందులో జయదేవ్ ఉనద్కత్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, టీ. నటరాజన్, అబ్దుల్ సమద్‌లు ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ముందుగానే ఏర్పాటు చేసిన వేడుకలో వీరు పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఇక ఆర్ఆర్తో జరుగుతున్న ఆటలో హైదరాబాద్ గెలవాలని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.