Ms Dhoni : ధోనీ కేసు పెట్టడంతో.. తన మాజీ బిజినెస్ పార్ట్నర్ అరెస్టు
ధోనీ మిత్రుడు, మాజీ బిజినెస్ పార్ట్నర్ మిహిర్ దివాకర్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే...?
MS Dhoni: క్రికెటర్ ధోనీ మిత్రుడు, మాజీ బిజినెస్ పార్ట్నర్ మిహిర్ దివాకర్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. తన పేరును అక్రమంగా వాడుకున్నాడని ధోనీ అతడిపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. రాంచీ జిల్లా కోర్టులో ధోనీ(Dhoni) ఫిర్యాదు ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా దివాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయిన దివాకర్‌ను(Diwakar) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. క్రికెట్ అకాడమీల ఏర్పాటు కోసం ధోనీ పేరును అక్రమంగా వాడుకున్నట్లు దివాకర్, సౌమ్యా దాస్ లపై ఫిర్యాదులు ఉన్నాయి. పలుమార్లు హెచ్చరించినా.. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా క్రికెట్ అకాడమీలను దివాకర్ ఏర్పాటు చేశాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలకు కూడా దివాకర్ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అతడు రూ.15 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్లు తెలుస్తోంది.
తనకు చెప్పకుండానే తన పేరును దివాకర్ వాడుకున్నాడని ధోనీ ఫిర్యాదు చేశారు. దివాకర్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీలోని సెక్షన్ 406, 420,467,468,471, 120B కేసు నమోదైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్, మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ పై కేసు ఫైల్ చేశారు ధోనీ.