»South Africa Star Cricketer Keshav Maharaj Visited Ayodhya Bala Ram
Keshav Maharaj: అయోధ్య రామమందిరాన్ని దర్శించిన సౌత్ఆఫ్రికా స్టార్ క్రికెటర్
ఐపీఎస్ సీజన్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజే ఉంది. ప్లేయర్లు అందరూ మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సౌత్ఆఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Keshav Maharaj: ఐపీఎస్ సీజన్(IPL2024) స్టార్ట్ అవడానికి ఒక్క రోజే ఉంది. ప్లేయర్లు అందరూ మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సౌత్ఆఫ్రికా(South Africa) స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్(Keshav Maharaj) అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్ బరిలో దిగుతున్నాడు. పోయిన సంవత్సరంలో దుబాయి వేదికగా జరిగిన మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఈ ప్లేయర్‌ను రూ.50లక్షలకు దక్కించుకుంది. లక్నో టీమ్‌లో ఈ యువ ఆటగాడు ఆడనున్నారు. ఈ క్రమంలో కేశవ్ మహారాజ్ అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు.
కేశవ్ మహారాజ్ రామమందిరంలో బాల రాముడిని దర్శించుకున్న సమయంలో తీసిన ఫొటోను సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఆయన రామభక్తుడు. భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు రాముడు అంటే అమితమైన ప్రేమ అని, అందుకే ఆయన ప్రత్యేకంగా శ్రీరాముడిని దర్శించుకోవాడానికి ఆయోద్యకు వెళ్లారని తెలుస్తుంది. ఇక 17వ సీజన్లో ఎల్ఎస్జీ(LSG) తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.