SDPT: ABVP వనవాసి స్టేట్ కో కన్వీనర్‌గా అక్కన్నపేట మండలానికి చెందిన గుగులోత్ పరశురాం నాయక్ రెండవసారి నియమకం అయ్యారు. శంషాబాద్‌లో జరుగుతున్న 44వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర అధ్యక్షుడు డా. రావుల కృష్ణ, పరుశురాంను స్టేట్ కో కన్వీనర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. పరుశురాం మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలపై అనునిత్యం పోరాడుతానని అన్నారు.