HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసేందుకు అభిమానులు హైదరాబాద్లోని తన నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు.