జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓటర్ల జాబితాపై జనవరి 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ఉండటం, విలీన గ్రామాల సమస్యలపై వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్నారు.