Shobha Shetty becomes the new captain of Bigg boss house
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా నిజంగానే పేరుకు తగినట్లు డిఫరెంట్గా సాగుతోంది. ఎవరి ఊహకు అందని విధంగా సాగుతోంది. గతవారం నుంచి కార్తీకదీపం ఫేమ్, నటి శోభా శెట్టి (Shobha Shetty) ఎలిమినేట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారు కోరుకోవడం ఏమో కానీ, ఆమె మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటోంది. నిజానికి శోభ గతవారమే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. అనూహ్యంగా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.
మిషన్ శోభ శెట్టి అన్నట్లుగా ప్రయత్నించారు. ఈ వారం శోభ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనుకున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్లో శోభ చివరి స్థానంలో ఉంది. ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అనుకున్నారు. అదృష్టం బాగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎలిమినేట్ అవ్వాల్సిన సమయానికి కెప్టెన్ అయ్యింది. శోభ కెప్టెన్ అయినట్లు టీవీలో టెలికాస్ట్ కాలేదు. బిగ్ బాస్ లీక్స్ ప్రకారం.. శోభ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.
గత సీజన్ల ప్రకారం నామినేషన్లో ఉన్నవారు సేవ్ అయితేనే, వచ్చే వారం వారికి కెప్టెన్ గా ఉంటూ, నామినేషన్ లో రాకుండా ఉంటారు. ఈ సీజన్ లో కొంచెం మార్పు చేశారు. కెప్టెన్ అయిన వారు నామినేషన్లో ఉన్నా, సేవ్ అయిపోయినట్లే. ఈ లెక్కన ఈ వారంతో పాటు, వచ్చే వారం కూడా శోభ సేవ్ అయిపోయింది. శోభ సేవ్ అవడం పక్కన పెడితే, ఆమె స్థానంలో మరో ఇద్దరు బలి అయ్యే అవకాశం ఉంది. శోభ తర్వాత చివరి స్థానంలో ఉన్న ప్రియాంక లేదంటే, తేజ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. మరో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినట్లే. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.