»Independent Candidate Arrived In Jabalpur With 25 Thousand Coins Officer Took 3 Hours To Count
Madhyapradesh : రూ.25వేల చిల్లరతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి
లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం జబల్పూర్కు చెందిన యువ స్వతంత్ర అభ్యర్థి వినయ్ చక్రవర్తి కూడా లోక్‌సభ కు నామినేషన్ వేసేందుకు వచ్చాడు.
Madhyapradesh : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం జబల్పూర్కు చెందిన యువ స్వతంత్ర అభ్యర్థి వినయ్ చక్రవర్తి కూడా లోక్‌సభ కు నామినేషన్ వేసేందుకు వచ్చాడు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫారమ్‌ను సమర్పించేందుకు అతను రూ.25,000 డిపాజిట్ చేశాడు. కొద్దిసేపటికే ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై జబల్పూర్ కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల ముసుగులో కొంత మంది పరిపాలన అధికారులను వేధిస్తున్నారన్నారు. వినయ్ చక్రవర్తి ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఆన్లైన్లో డబ్బు తీసుకునే విధానం ఎన్నికల కమిషన్ వద్ద లేదు. అందుకే చిల్లర మాత్రమే డిపాజిట్ చేశాడు.
జబల్పూర్ నుంచి ఎల్ఎల్బీ చదువుతున్న వినయ్ చక్రవర్తి జబల్పూర్ లోక్‌సభ నుంచి ఎంపీ పదవికి నామినేషన్ పత్రాలను కొనుగోలు చేశాడు. వినయ్ చక్రవర్తి తన స్నేహితులతో కలిసి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేసేందుకు రాగా.. ఇందుకోసం రూ.25 వేలు డిపాజిట్ చేయాలని నామినేషన్ పనులు చేస్తున్న అధికారులు చెప్పారు. వారు ఈ మొత్తాన్ని నగదు రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. వినయ్ చక్రవర్తి ఆన్లైన్ చెల్లింపు ఎంపిక కోసం అధికారులను కోరారు. కానీ ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదని అధికారులు చెబుతున్నారు.
ఆ సమయంలో వినయ్ చక్రవర్తికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులను పిలిచాడు. అతనికి మద్దతుగా ఉన్న కొందరు చిన్న దుకాణదారులు ఆందోళన చెందవద్దని చెప్పారు. మేము డబ్బు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత కొద్దిసేపటికే చిల్లర్లతో అక్కడికి చేరుకున్నారు. వినయ్ చక్రవర్తి మళ్లీ చిల్లర రూపంలో రూ.25 వేలు డిపాజిట్ చేశాడు. నాణేలన్నీ 10 రూపాయలవి. వాటిని లెక్కించేందుకు ఎన్నికల అధికారికి 3 గంటల సమయం పట్టింది. వినయ్ చక్రవర్తి మాట్లాడుతూ ‘ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని, అయితే ఆ సమయంలో తన వద్ద ఎలాంటి నగదు అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా డిపాజిట్ చేశానని’ చెప్పాడు.