»Devineni Uma Allegations On Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad పై దేవినేని ఆరోపణలు..!
Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఆ సమయంలో మాట్లాడిన ఆయన కృష్ణ ప్రసాద్ పై ఆరోపణలు చేశారు.
పాపాలన్నీ చేసి ఇళ్లకు స్టిక్కర్లు వేస్తే ప్రజలు హర్షించరు అంటూ దుయ్యబట్టారు. మైలవరం నియోజకవర్గంను దోచుకోవడానికే ఆగర్భ శ్రీమంతుడు అనే ముసుగు వేసుకొని వసంత ఎమ్మెల్యే అయ్యాడంటూ ధ్వజమెత్తారు. కొత్తూరు తాడేపల్లి, వేమవరం, నైనవరంలో అక్రమంగా గ్రావెల్ తోలకాలు జరిగినట్లు అధికారులు నివేదిక అందజేశారన్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక పై ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని ఎమ్మెల్యేను నిలదీశారు.
కొండపల్లి అడవిలో గ్రావెల్ అమ్ముకుంది ఎవరు? అధికారులు ఫైన్ వేస్తే కట్టింది ఎవరు? అటవీ అధికారులను బదిలీ చేయించింది ఎవరు? తప్పు చేయకపోతే రూ.10 లక్షలు ఫైన్ ఎందుకు కట్టారు? మీ బామ్మరిది నీ బినామీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నీ రాజీనామా డ్రామాలు కట్టిపెట్టి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నువ్వు, మీ పార్టీ నాయకులు తప్పు చేసినట్టు రుజువు అయిందన్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.