Vasantha Krishna Prasad: ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈరోజు ఉదయం వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైఎస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 March 2nd).. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను వ్యక్తగతంగా దూషించాలని జగన్ చెప్పారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వక్తిగతంగా వాళ్లను దూషించమన్నారు. అందుకే వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్న అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇది కూడా చూడండి: Dutch Tourist : డచ్ పర్యాటకుడిపై లూటీ… నెల రోజులుగా బిచ్చగాళ్లతో టూరిస్ట్!

