ఎలెక్షన్లు అయిపోయాయి… జనాలు మళ్ళీ మాములు జీవితానికి అలవాటు పడ్డారు. ఏపీ లో ఒక ఎమ్మెల్యే చేసిన ఒక పనికి సోషల్ మీడియా మొత్తం ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మైలవరం నియోజకవర్గం లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, స్థానికులను పరామర్శించారు. ఈ సందర్శనలో, వసంత కృష్ణప్రసాద్ వరద నీటిలో నడుము వరకు మునిగి కాలనీల్లో పర్యటించారు.
వసంత కృష్ణప్రసాద్ వరదతో మునిగిన ప్రాంతాలను సందర్శించి, ప్రతి ఇంటి ముందుకు వెళుతూ ప్రజల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహారం, నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వారి బాధలు, కష్టాలు అర్థం చేసుకోవడం కోసం, ప్రతి కుటుంబంతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
అలాగే, ఎమ్మెల్యే స్థానిక కలెక్టర్‌ను సంప్రదించి, వరద నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాలని అభ్యర్థించారు. వరద కారణంగా మార్గాలు కిర్లిపోయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో, నీటి నిలువలను తొలగించడం అత్యంత అవసరమైన చర్య అని ఆయన తెలిపారు. గతంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయపడేవారు