GHMC (Greater Hyderabad Municipal Corporation) ప్రజల సురక్షితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన సూచనలను జారీ చేసింది. వచ్చే 2 రోజులు తూఫాన్ ప్రభావంతో నగరంలోని వర్షపాతం ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. ఈ క్రమంలో GHMC ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది. ముఖ్యంగా, పిల్లలను ఇంటి లోపలే ఉంచాలని, నీటితో నిండిన రోడ్లపై ప్రయాణించకుండా, ముఖ్యంగా టూ వీలర్స్ జాగ్రత్త పడాలని సూచించింది.
తక్షణ సహాయం అవసరమైనప్పుడు GHMC’s టోల్-ఫ్రీ నంబర్ 040 21111111 లేదా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) 9000113667 సంప్రదించవచ్చని తెలియజేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మునిగే ప్రమాదం ఉన్నప్పటికీ, GHMC అధికారులు సురక్షితమైన పరిష్కారాలను అందించడానికి అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.