తెలంగాణ రాష్ట్రం వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి, మరియు సెప్టెంబర్ 2 వరకు, 4 నుండి 11 జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పటించవచ్చు.
IMD అందించిన సమాచారం ప్రకారం, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది, అలాగే మరికొన్ని జిల్లాలకు పసుపు అలర్ట్ విడుదల చేయబడింది. ఈ అలర్ట్స్ ఆధారంగా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ భారీ వర్షాలకు ప్రధాన కారణం బంగాళా కాతంలో ఏర్పడిన సైక్లోన్ అని చెప్పారు. ఇది శనివారం నాటికి మరింత తీవ్రమై, దక్షిణ తీర ఆంధ్రా మరియు ఒడిశా వైపు చేరవచ్చని చెబుతున్నారు.
ఆగష్టు 31న ములుగు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 1న ఖమ్మం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్ , కామారెడ్డి లో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ .