ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజా వైసీపీ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండటం దీనికి సంకేతం అని పలువురు చర్చించుకుంటున్నారు. దీనితో పాటు, రోజా, ఆమె భర్త సెల్వమణి తమిళనాడులో DMK పార్టీలో చేరుతారని చాల బలంగా వినిపిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో వారు ఇటీవల కొన్ని సార్లు సమావేశమయ్యారు.
గత కొన్ని నెలలుగా టెలివిజన్ షోలలో కూడా కనిపించట్లేదు రోజా. గత ఎన్నికల్లో తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ నుంచి సైతం వ్యతిరేకత ఎదుర్కున్న రోజా, నగిరిలో టీడీపీ లీడర్ గాలి భాను ప్రకాశ్ పై పోటీ చేసి 45 వేల ఓటు మెజారిటీతో ఓడిపోయారు. ఈ పరాజయం రోజా కి తీవ్ర నిరాశనిచ్చింది మరియు ఆమె రాజకీయ భవిష్యత్తుపై కొన్ని సందేహాలు మొదలయ్యాయి.
రోజా రాజకీయపరమైన ఇబ్బందుల కారణంగా పార్టీల మధ్య మార్పును పరిగణనలోకి తీసుకుంటున్నారు. DMKలో చేరడం ద్వారా ఆమె తమిళనాడులో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చని భవిస్తూ ఉండవచ్చు. గత కొంతకాలంగా వైసీపీ లో రాజీనామాల పరంపర కొనసాగుతుంది. రోజా పార్టీలో ఉంటారా? ఊహాగానాలు వినిపిసితున్నట్టు తమిళనాడులో రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటారో చూడాలి