రోజా… ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తానికి తెలుసు రోజా ఎవరనేది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఆమె సినిమాల్లో నటించారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన రోజా, గడిచిన 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ (టీడీపీ) పై 43 వేల పైన ఓట్ల తేడాతో భారీ ఓటమిపాలైయ్యారు.
ఓటమి అనంతరం రోజా కొద్ది రోజులు నగరి, మరికొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు. రీసెంట్ గా రోజా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎఉరోపే లోని ఇటలీ టూర్ కి వెళ్లారు. ఆ టూర్ లో ఉండగా ఒక ఫోటో బయటకు లీక్ అయ్యింది. ఆ ఫొటోలో రోజా పొట్టి డ్రెస్ వేసుకున్నట్టు ఉంది. ఈ ఫోటోపై ప్రత్యర్థి పార్టీలకు సంబందించినవారు స్పందిస్తూ రోజాను ట్రాల్ చేశారు
నిజానికి ఆ డ్రెస్ లో ట్రోల్ చేయాల్సినంత ఏమి లేదు. కానీ రోజా అధికారం లో ఉన్నప్పుడు తన ప్రత్యర్థులపై వస్త్రాలంకారణపై హాట్ కామెంట్స్ చేశారు. అవన్నీ గుర్తు చేస్తూ.. దేశం దాటగానే మన సంప్రదాయం మర్చిపోయావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీల వారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి