రెండు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురై రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రైతుల పంటలు నీటమునిగి వారికి కన్నీటిని మిగిల్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేసింది