ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆరేళ్ళ క్రితం విడుదలైన KGF సృష్టించిన చరిత్ర గురించి ఇండియా మొత్తం తెలుసు. మొదటి పార్ట్ లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తన మేకింగ్ స్టైల్ తో మెస్మరైజ్జ్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తరువాత వచ్చిన సీక్వెల్ గురించి చెప్పక్కర్లేదు. రెవిన్యూ పరంగా, క్రిటిక్స్ పరంగా ప్రశాంత్ నీల్, హీరో యష్ రేంజ్ ను అమాంతంగా పెంచేసిన సినిమా
తాజాగా ప్రశాంత్ నీల్ KGF యూనివర్స్ లోకి మరో స్టార్ హీరోను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రశాంత్ నీల్ కొన్ని రోజుల క్రితం ఒక కథ చెప్పారు, అది KGF యూనివర్స్ లో భాగమే అంటున్నాయి సినీ వర్గాలు. నీల్ తీసిన సలార్ కి కూడా KGF తో లింక్ ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. ఇదే జరిగితే మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయంగానే కనిపిస్తుంది.
అయితే ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కంటే ముందు ఎన్టీఆర్ తో, ప్రభాస్ తో సలార్ 2 సినిమాలు చేయాలి. ఎన్టీఆర్ తో చేసే సినిమా 2 పార్ట్శ్ అని అంటున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సలార్ KGF రేంజ్ లో కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లపైన గ్రాస్ వసూలు చేసి, టాప్ ఇండియన్ ఫిలిమ్స్ సరసన చేరింది. KGF 2 చివర్లో పార్ట్ 3 కి హింట్ ఇచ్చిన నీల్, ఆ సినిమాలో యష్ తో పాటు ప్రభాస్, అజిత్, ఎన్టీఆర్ ను కూడా నటింపజేస్తాడో లేదో కాలమే సమాధానం చెబుతుంది