ఉస్తాద్ రామ్ పోతినేని. పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు ప్రేక్షకులకు 2006లో దేవదాసు సినిమాతో పరిచయమైనా స్టార్. తొలి సినిమాతోనే ఎనెర్గెతిచ్ పెర్ఫార్మన్స్ తో, తన డాన్సులతో యూత్ అండ్ ఫామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రామ్. ఏళ్ళు గడిచేకొద్దీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఫామిలీ సినిమాలు చేస్తూ తన బిజినెస్ తో పాటు, ఫ్యాన్స్ ని కూడా పెంచుకున్నాడు
మన హీరోల సినిమాలు నార్త్ ఇండియాలో హిందీలో డబ్ చేస్తారనే విషయం తెలిసిందే. దాదాపుగా ప్రతీ హీరో సినిమాను నార్త్ డబ్బింగ్ రైట్స్ మంచి రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. అక్కడ ఈ సినిమాలను సాటిలైట్ ఛానెల్స్ లో టెలికాస్ట్ మరియు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఈ డబ్బింగ్ సినిమాల్లో రామ్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఏ హీరో సాధించలేని ఘనత రామ్ కి మాత్రమే దక్కింది.
పదకొండు సినిమాలు వరుసగా 100 మిలియన్ వ్యూస్ ధాటి సెన్సేషన్ గా నిలిచాయి, రీసెంట్ గా రిలీజ్ అయినా స్కంద సినిమా కూడా 100 మిలియన్ వ్యూస్, 1.1 మిలియన్ లైక్స్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. గతంలో అల్లు అర్జున్ సినిమాలు కూడా నార్త్ లో మంచి రెస్పాన్స్ ఉండేది. చాల కాలం తరువాత పుష్ప తో అల్లు అర్జున్ ఆ క్రేజ్ ను మార్కెట్ గ మలుచుకున్నారు. ఇప్పుడు రామ్ కూడా రాబోయే సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబల్ ఇస్మార్ట్ హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నాడు. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.