»Adr And New Report Ys Jagan Reddy Richest Chief Minister In India
దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. KCRకు అప్పులే ఎక్కువ
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచాడు.
పలుకులు మాత్రం బీద పలుకులు.. నాకు ఆర్థిక బలం లేదు అంటాడు.. కానీ దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా మాత్రం నిలుస్తాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా (Richest CM in India) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నిలిచాడు. దేశంలోని అందరూ సీఎంల ఆస్తి కలిపినా కూడా మన జగనే పైచేయి సాధించాడు. కానీ ఆయన పాలించే ఏపీ (Andhra Pradesh) మాత్రం పేద రాష్ట్రంగా నిలుస్తోంది. అప్పులు చేయనిదే రాష్ట్రం గట్టెక్కలేని పరిస్థితి.
వివిధ రాష్ట్రాలలో పాలన అందిస్తున్న 30 ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల (Affidavits) ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) (Association for Democratic Reforms -ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) (National Election Watch-NEW)సంస్థలు సంయుక్తంగా ఈ విషయాలను వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల సీఎంల ఆస్తులపై బుధవారం ఓ నివేదిక విడుదల చేసింది. సీఎం జగన్ పేరిట రూ.510 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిలో రూ.443 కోట్లు చరాస్తులు ఉండగా.. మిగతా స్థిరాస్తులు ఉన్నాయి. జగన్ కు తెలంగాణ, ఏపీతో పాటు బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి.
కేసీఆర్ కు అప్పులే ఎక్కువ
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఆస్తి విలువ రూ.23.55 కోట్లు ఉంది. అప్పులు రూ.8.88 కోట్ల మేర ఉన్నాయి. అప్పులతో పాటు కేసులు కూడా కేసీఆర్ కే అధికంగా ఉన్నాయి. దేశంలో మరే ముఖ్యమంత్రిపై లేనన్ని కేసులు కేసీఆర్ పై నమోదయ్యాయి. కేసీఆర్ పేరు మీద ఏకంగా 64 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ పై అనేక కేసులు మోపబడ్డాయి. ఇక కేసుల పరంగా తమిళనాడు సీఎం స్టాలిన్ (47), ఏపీ సీఎం జగన్ (38) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
ఇక అత్యంత పేద సీఎం ఎవరంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె ఆస్తి కేవలం రూ.15 లక్షలుగా ఉంది. ఇక రెండో సంపన్న ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ (రూ.163 కోట్లు) నిలువగా.. మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లు) నిలిచాడు. కేరళ సీఎం పినరయి విజయన్ (రూ.18 కోట్లు), హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (1.27 కోట్లు), బిహార్, ఢిల్లీ సీఎంలు నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు రూ.3 కోట్లకు పైగా ఉన్నాయి.
కాగా దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం 11 మంది మాత్రమే పట్టభద్రులు ఉండడం గమనార్హం. డిగ్రీ పూర్తి చేసిన వారు 11 మంది, పీజీ చేసిన వారు 9 మంది ఉన్నారు. మిగతా వారు అంతకన్నా తక్కువ చదివిన కేటగిరిలో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీకి కూడా డిగ్రీ లేని విషయం తెలిసిందే. కానీ డిగ్రీ చదివినట్లు అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. ఆ డిగ్రీ పట్టా చూపించాలని ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.