»Ap Dog Tore The Sticker Of Ys Jagan Photo Video Goes To Viral
సీఎం జగన్ పోస్టర్ ను పీకేసిన కుక్క.. వైరల్ గా మారిన వీడియో
భవనాలకు పార్టీ రంగులు వేయడం.. స్టిక్కర్లు అతికించడం వంటివి చూస్తుంటే పార్టీని ప్రజలు మరచిపోతారనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ సీపీ (YSRCP) వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికి స్టిక్కర్లు (Stickers) పంచుడు మొదలుపెట్టింది. వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పుకుంటూ ప్రజల ఇండ్లపై బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తోంది. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్లు (Cellphones), వాహనాలు (Vehicles) ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ.. ఏది కనిపిస్తే దాని మీద తెగ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్’ అనే స్టిక్కర్ల కార్యక్రమానికి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలు చాలా చోట్ల స్టిక్కర్లను వ్యతిరేకిస్తున్నారు. కాగా వైసీపీ నాయకులు ఈ స్టిక్కర్లను వింతవింతగా అతికిస్తున్నారు. ఏకంగా మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, చెప్పులకు వంటి చోట్ల అంటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ స్టిక్కర్లకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారిక మీడియాలో ‘జగనన్నే మా భవిష్యత్’ అనే స్టిక్కర్ ను కుక్క తొలగిస్తున్న వీడియో కనిపించింది. గోడకు అతికించిన సీఎం జగన్ (YS Jagan) పోస్టర్ ను కుక్క తొలగిస్తోంది. ఈ పోస్టర్ ను తొలగించినందుకు కుక్కపై కూడా కేసు వేస్తారా? అని టీడీపీ ప్రశ్నించింది. ‘ఇప్పుడు దాని మీద కూడా కేసు నమోదు చేసి రకరకాల కోర్టులకు తిప్పి దాన్ని బతకనివ్వరు ఏమో ఇంకా’ అంటూ వ్యంగ్యంగా టీడీపీ పోస్టు చేసింది. చాలా చోట్ల అతికించిన పోస్టర్లు, స్టిక్కర్లను ప్రజలే తొలగిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి ప్రచార పిచ్చి బాగా ఎక్కింది. భవనాలకు పార్టీ రంగులు వేయడం.. స్టిక్కర్లు అతికించడం వంటివి చూస్తుంటే పార్టీని ప్రజలు మరచిపోతారనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.