గత ప్రభుత్వ హయాంలో భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు రూ.100ల్లో ఉంటే.. తన సినిమా టికెట్‌ను రూ.10, రూ.15 చేశారని డిప్యూటి సీఎం, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అప్పుడు నేను ఒకటే చెప్పాను. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’. ఇది డబ్బు కోసమో.. రికార్డులు కోసమో కాదు.. ఇది ధైర్యం, సాహసం, న్యాయం కోసం’ అని పేర్కొన్నారు.