VZM: కొత్తవలస మండల కేంద్రంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో సూపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటా పర్యటించి ప్రజలకు కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఏ స్థాయిలో అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.