KDP: జిల్లాలో మూతపడిన చక్కర కర్మాగారం, మైదుకూరులోని పసుపు దాన కేంద్రం, ప్రొద్దుటూరు పాల కర్మాగారం తదితర మూతపడ్డ పరిశ్రమలను వెంటనే తెరిపించాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏపీ రమణ అన్నారు. సోమవారం దువ్వూరులో రైతు సంఘం నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులుగా పలువురు పాలించిన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.