PDPL: ఓదెల మండల కేంద్రంలోని లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్లో మండలానికి సంబంధించిన పెద్ద కోమిరే, భీమరపల్లె, జీలకుంట,మడక, నాంసానిపల్లి, లంబాడి తండా గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రొసీడింగ్స్ పత్రాలను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు.