SRPT: పాము కాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన నడిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై జి అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గొర్ల మంద దగ్గర కాపలాగా పడుకున్న యాదగిరి అనే వ్యక్తిని పాము కాటు వేయడంతో అతనిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారని ఎస్సై పెర్కోన్నారు.