ప్రకాశం: పెయిడ్ ఆర్టిస్టుల మాటలు పట్టించుకోమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తుందని, మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారన్నారు.