కోనసీమ: ‘సుపరిపాలనలో- తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండపేట పట్టణం 22వ వార్డులో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించారు. అలాగే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.