NTR: ప్రజాసంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం పాల్గొన్నారు. తల్లికి వందనం, దీపం పథకం కింద సొమ్ము జమ అయిందా? అంటూ లబ్ధిదారులను ప్రశ్నించారు.