IPL Cricket Betting బెట్టింగుల భారీ ముఠా అరెస్ట్.. రూ.కోట్లలో దందా
బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) వ్యవహారంపై తెలంగాణ పోలీసులు (Telangana Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్ లైన్ వేదికగా డబ్బుతో ఆటలు ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోట్లలో బెట్టింగులు నిర్వహిస్తున్న ముఠాను (Gang) పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ పద్ధతుల్లో ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ (Hyderabad) పోలీసులు (Cyberabad Police) గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, అత్యాధునిక పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra) వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ లోని బాచుపల్లిలో (Bachupally) ఓ అపార్ట్ మెంట్ లో ఐపీఎల్ మ్యాచ్ లపై ఆన్ లైన్ వేదికగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారనే సమాచారం అందింది. ఈ సమాచారంతో మంగళవారం బాలానగర్ ఎస్ వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. అపార్ట్ మెంట్ లో దాడులు చేయగా 10 మంది పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.60.39 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.5.89 లక్షలు, రూ.33 లక్షల విలువైన లైన్ బోర్డులు, ల్యాప్ టాప్ లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు, 60 సిమ్ లు, మైక్రోఫోన్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారమంతా విజయవాడకు చెందిన పండు నిర్వహిస్తున్నాడు. కాగా దాడి సమయంలో పండు పరారయ్యాడు.
పట్టుబడిన నిందితులు వీరే..
హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన వెంకట శివరామకృష్ణ, ప్రతాప్ గణకుమార్, శింగమనేని కిరణ్ కుమార్, ఎర్రమంజిల్ కు చెందిన నందం శ్రీనివాస్ బాబు, కడియాల మహేశ్, కాశీలతో పాటు ఏపీలో కోనసీమ జిల్లా రాయవరం మండలం సూర్యరావుపేటకు చెందిన విజయ్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన వినయ్, వెంకట రత్నకుమార్, చీరాలకు చెందిన శ్రీకాంత్ లను సహాయకులుగా నియమించుకుని పండు బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడు.
ఈ ముఠా కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష పందెం కాసే పంటర్లతోనే బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ తో పాటు ప్రత్యక్షంగా నగదు తీసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు.
The Cyberabad SOT Balanagar Zone has busted several organized cricket betting rackets during the ongoing IPL 2023 cricket matches. They have apprehended 23 cricket bookies who were involved in online cricket betting and seized Net cash of Rs. 66,28,239, 14 betting boards, pic.twitter.com/81zbaZsJmh