VZM: ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడి నెపంతో జీతాలు ఆపడం శోచనీయమని SGTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. మంగళవారం గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ.. బదిలీలు జరిగి నెల రోజులైనా పొజిషన్ ఐడీలపై అధికారుల జాప్యం చేయడం చాలా అన్యాయం అన్నారు. దీంతో టీచర్లకు జూన్, జూలై జీతాలు కూడా అందని పరిస్థితి దాపురించిందన్నారు.