GNTR: జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం పేరిట పేదల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించిన కేసులో కాంట్రాక్టర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.పెదరావూరు లేఅవుట్లో ఇళ్లు నిర్మిస్తామంటూ డబ్బులు తీసుకుని నిర్మాణం చేపట్టకపోవడంతో అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై ఆనంద్ తెలిపారు. గతంలో బుర్రిపాలెం, నేలపాడు లేఅవుట్లలో కూడా ఇతడు మోసాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.