RR: గండిపేట మండలం మంచిరేవులలో చిరుతపులి కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ క్యాంపస్లో కానిస్టేబుళ్లకు చిరుత కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. క్యాంపస్లో గాలించారు. చిరుత ఆచూకీ లభించకపోవడంతో రెండు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.