గంగూబాయి హనగల్.. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన గాయని. 1940లో ఆర్ ఇండియా రేడియో ప్రసారాలు, దేశవ్యాప్తంగా జరిగిన సంగీత కచేరీల ద్వారా ప్రసిద్ధి చెందారు. తొలినాళ్లలో భజనలు, ఠుమ్రీలు పాడేవారు. ఆ తర్వాత కిరణా ఘరాణా శైలిపై దృష్టి సారించారు. తన సంగీతం ద్వారా పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, పద్మవిభూషణ్ పురష్కరాలను అందుకున్నారు.