KRNL: హంద్రీనీవా కాలువకు ఖరీఫ్ సీజన్లో సాగునీటి కోసం కృష్ణా జలాలు పత్తికొండకు చేరాయి. కాలువ వెడల్పు పనులు, లైనింగ్ నిర్మాణం జరుగుతున్నందున ప్రస్తుతం 3 పంపులతో 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు HNSS ఏఈ నజీర్ మంగళవారం తెలిపారు. కాలువ పటిష్టత ఆధారంగా నీటి సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. పందికొన రిజర్వాయర్ గేటు తెరిచినట్లు తెలిపారు.