మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు కోన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ స్మిత్ అద్భుత సెంచరీతో(140) మెరవడంతో 474 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.