క్రికెట్ అనగానే చాలా మందికి కేవలం పురుషులు మాత్రమే ఆడే ఆట అనే భావన ఉండేది. ఆ భావనను మహిళల క్రికెట్ జట్టు తుడిచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మహిళల జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. కాగా… ఎన్ని విజయాలు సాధించినా… వీరికి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదు. అయితే… తాజాగా ఈ విషయంలో మహిళల జట్టుకి బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ముంబైలో మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం( AGM) సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్(woman ipl)కు ఆమోదం తెలిపింది. సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ నియామకంతో సహా AGM సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. “ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి జనరల్ బాడీ ఆమోదించింది” అని BCCI నుండి ఒక ప్రకటన విడుదల చేసింది.
మహిళల IPL(woman ipl)మొదటి సీజన్‌ను వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే అవకాశం ఉందని గతంలో వివిధ పలు మీడియా నివేదికలు తెలిపాయి. ఉమెన్స్ ఐపీఎల్ లో ఐదు జట్లు ఉంటాయని తెలుస్తోంది. మహిళా ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో 2023 మహిళల T20 ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ESPNcricinfo ప్రకారం, ప్రతి జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉంటారట. ఇందులో గరిష్టంగా ఆరుగురు విదేశీ వారిని తీసుకొవచ్చట. ఈ ఐదుగురు ఆటగాళ్లలో ఒకరు తప్పనిసరిగా అసోసియేట్ దేశానికి చెందినవారు అయి ఉండాలట. ఈ సీజన్లో 22 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని తెలుస్తోంది.