GTతో జరిగిన ఉత్కంఠ పోరులో DC ఓటమిపాలైంది. చివరి ఓవర్లో DC విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా.. 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ నిరాకరించాడు. ఇక చివరి బంతికి పరుగు తీసే క్రమంలో కుల్దీప్ రనౌట్ కావడంతో ఢిల్లీ పరాజయం పాలైంది. 20 బంతుల్లో 41 పరుగులు చేసి గెలుపు అంచుల్లోకి తీసుకెళ్లిన మిల్లర్, చివరి క్షణంలో చేసిన తప్పిదం అభిమానులను నిరాశకు గురిచేసింది.