Australia Won By 2 Wickets Against England Ashes 2023 Series
Ashes 2023 Series: యాషెస్ సిరీస్ (Ashes 2023 Series) ఫస్ట్ టెస్ట్‌లో కంగారులు విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ఐదు టెస్టులో సిరీస్‌లో 1-0 లీడ్‌లో ఉన్నారు. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో తొలి టెస్ట్ జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. ఫస్ట్ డే 393 రన్స్ చేసిన ఇంగ్లాండ్ ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఉస్మాన్ ఖ్వాజా సెంచరీ చేశాడు. ఆసీస్ (Australia) టీమ్ మాత్రం 386 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
7 పరుగుల లీడ్‌తో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లియాన్, కమిన్స్ చెరో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును దెబ్బతీశారు. ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్, ఖ్వాజా శుభారంభం అందించారు. జట్టు స్కోర్ 61 పరుగులు ఉన్నప్పుడు వార్నర్ ఔట్ అయ్యాడు. మార్నస్ లాబుస్చాగ్నే, స్మిత్ వికెట్లు పడిపోయాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టపోయి 107 పరుగులు చేసింది. చివరి రోజు వర్షం వల్ల తొలి సెషన్ జరగలేదు. రెండో సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. స్కాట్ బోలాండ్ వికెట్ తీశారు. వెంటనే ట్రావిస్ హెడ్, మొయిన్ అలీ కూడా ఔట్ అయ్యాడు. గ్రీన్, ఖ్వాజా కూడా అలా ఇచ్చి ఇలా వెళ్లారు. పాట్ కమిన్స్, నాథన్ లియాన్ జాగ్రత్తగా ఆడి.. జట్టుకు విజయాన్ని అందించారు.