తమ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతోనే తన సెంచరీని ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నానని SRH విధ్వంసకరం బ్యాటర్ అభిషేక్ శర్మ తెలిపాడు. ’20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని మా కోచ్ కోరుకున్నాడు. బహుశా నేను 20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఆ సెలబ్రేషన్. ఈ గ్రౌండ్లో సెంచరీ చేయడం ఎప్పుడూ స్పెషలే’ అని చెప్పుకొచ్చాడు.