టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ టీమిండియాకు కీలక సూచన చేశాడు. విండీస్ జట్టులో అత్యంత ప్రమాదకర బ్యాటర్ హెట్మయెర్ అని తెలిపాడు. అతడిని త్వరగా ఔట్ చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని చెప్పాడు.