ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా గుకేష్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతిని గుకేష్ అందుకున్నాడు. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తం ప్రైజ్ మనీ రూ.21.17 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్‌కి రూ.1.69 కోట్లు అందిస్తారు. గుకేష్ గెలిచిన 3 గేమ్స్‌కు రూ.5.07 కోట్లు, లిరెన్ 2 గేమ్స్‌కు రూ.3.38కోట్లు ఇచ్చారు. మిగిలిన మనీని సమంగా పంచారు.