ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సాంట్నర్ కోలుకోవడానికి రెండు మూడు వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో అతడి స్థానాన్ని సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్తో భర్తీ చేసినట్లు ముంబై ఇండియన్స్ వెల్లడించింది.