WGL : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎదుట కార్పొరేషన్ ఉద్యోగులు ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ సానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్‌పై మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిళ్ళ రమేష్ దుర్భాషలాడిన ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.