18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుకేష్‌కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ‘గుకేష్ యావత్ భారతదేశం గర్వపడేలా చేసారు. కేవలం 18 ఏళ్ల వయస్సులో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించడం ఒక అద్భుతమైన విజయం. మీ విజయం దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమని మాకు గుర్తు చేస్తుంది. అభినందనలు, ఛాంప్!’ అని ట్వీట్ చేశారు.