‘ఖేల్ రత్న’ నామినేషన్లలో వివక్షపై మరో ఛాంపియన్ ఆరోపణలు చేశారు. పారా ఒలింపియన్లను గుర్తించడం లేదంటూ పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్విందర.. ఈ ఏడాది పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. అథ్లెట్ మను బాకర్ నామినేషన్ వివాదం వేళ ఈ పారా ఆర్చర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.