తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ గడ్డపై చెలరేగుతున్నాడు. తనకు ఇది మొదటి సిరీస్ అయినా ఏ మాత్రం భయం లేకుండా ఆ జట్టు స్టార్ పేసర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నితీష్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. నితీష్ సెంచరీ చేయగానే.. మైదానంలో తన తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 354/9.